Hardik pandya focusses on ipl than placement in teamindia.
#hardikpandya
#teamindia
#ipl2022
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్సీ వహిస్తున్న పాండ్యా ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ క్యాప్ కాంటెండర్ లిస్టులో (అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే క్యాప్) రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో 81.83సగటుతో 491పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ బట్లర్ ఉన్నాడు. కాగా హార్దిక్ పాండ్యా 73.75సగటుతో 295పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. పాండ్యా ఈ సీజన్లో 7.65ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. 5 ఇన్నింగ్స్‌లలో 4వికెట్లు తీశాడు. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ కాన్సిస్టెన్సీ కనబరుస్తున్నాడు. అతను గాయం కారణంగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైనా తిరిగి నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టుతో చేరాడు. మంచి ఫామ్ కొనసాగిస్తుండడంతో అతను టీమిండియా తలుపు తట్టే అవకాశం ఉంది.